పిల్ల కాలువను తలపిస్తున్న కృష్ణా నది

56చూసినవారు
ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో దాచేపల్లి మండలం తంగెడ వద్ద నీరు లేక కృష్ణా నది పిల్ల కాలవలను తలపింప చేస్తుంది. ఈ సమయానికి ఉరుకులు పరుగులు పెట్టవలసిన కృష్ణా నది ఈ ఏడాది సరైన వర్షాలు లేక వెలవెల పోతోంది. ఎగువ రాష్ట్రాలలో సైతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నీరు లేక కళ తప్పాయి. వ్యవసాయ సీజన్ ఆరంభం అయినప్పటికీ ప్రాజెక్టులలో నీరు లేక కాలవలు వదలలేని స్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్