లంక గ్రామాలలో కలెక్టర్ పర్యటన
వరద ఉధృతికి దెబ్బతిన్న కొల్లూరు మండలం పెసరలంక గ్రామంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి బుధవారం పర్యటించారు. లంక గ్రామాలలో పరిస్థితిపై దెబ్బతిన్న గృహాలలోకి స్వయంగా వెళ్లి ప్రజలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఏ ఒక్కరు అధైర్య పడవద్దని ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం అందజేస్తామన్నారు.