ప్రేమించలేదని యువతిని కత్తితో పొడిచి చంపేశాడు

54చూసినవారు
ప్రేమించలేదని యువతిని కత్తితో పొడిచి చంపేశాడు
అసోంలోని గువాహటిలో గురువారం ఉదయం ఘోరం జరిగింది. మౌసుమీ గొగోయ్‌ అనే యువతిని ప్రేమ పేరుతో క్యాబ్ డ్రైవర్ భూపేన్ దాస్‌ వేధిస్తున్నాడు. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంలో దారుణానికి పాల్పడ్డాడు. పట్టపగలు ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మెడ, చేతి, పొత్తికడుపుపై ​​పలుమార్లు కత్తితో దాడి చేశాడు. అనంతరం తనను తాను పొడుచుకున్నాడు. యువతి ఆసుపత్రిలో చనిపోగా, నిందితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్