సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ సూచించారు. 'గతంలో సినీ పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. మా ప్రభుత్వం ఇండస్ట్రీకి అండగా ఉంటుంది' అని హామీ ఇచ్చారు.