సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందువుగా ఉండేలా హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. 'హైదరాబాద్‌లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం. దేశంలోని కాస్మోపాలిటన్ సిటీల్లో సినీ పరిశ్రమ ఎదుగుదలకు హైదరాబాద్ బెస్ట్ సిటీి. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధాన కర్తగా ఉండేందుకు దిల్ రాజును TGFDC ఛైర్మన్‌గా నియమించాం' అని తెలిపారు.