పల్నాడు: డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా భూములు అమ్మారని ఆరోపించారు. భూములు ఇవ్వమని చెప్పిన వారిపై పెట్రోల్ బాంబులు వేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలోని పెద్దలు భయపెట్టి, దాడులు చేసి భూములను లాక్కున్నారని పవన్ మండిపడ్డారు.