AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1,35,000 కోట్లతో నిర్మించే ఈ ప్లాట్ కోసం తొలి దశలో 2,200 ఎకరాలు కేటాయించింది. దీనితో పాటు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ (తిరుపతి), ఫిలిప్స్, కార్బన్ బ్లాక్ (నాయుడుపేట), ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ (అన్నమయ్య/కడప) కంపెనీలకు భూములు కేటాయించింది.