AP: వైసీపీ హయాంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ కేసులో సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం రఘురామ కృష్ణరాజు స్పందిస్తూ.. విజయ్ పాల్ అరెస్ట్‌ను స్వాగతించారు. కస్టడీలో తనను కొట్టిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని, ఎవరినీ వదిలిపెట్టనన్నారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.