తురకపాలెంలో కొనసాగుతున్న పోలీసు బందోబస్తు
మాచవరం మండలం తురకపాలెం గ్రామంలో మంగళవారం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న నేపథ్యంలో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఐ వెంకట్రావు ఇరువర్గాలతో చర్చించి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని వారికి సూచించారు. ఎస్సై సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం కూడా గ్రామంలో పర్యటించారు.