భక్తులకు అన్ని వసతులు కల్పించండి: సర్పంచ్

73చూసినవారు
భక్తులకు అన్ని వసతులు కల్పించండి: సర్పంచ్
మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలోని ఎత్తిపోతల పుణ్యక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు శనివారం అధికారులకు సూచించారు. ఈనెల 17న తొలి ఏకాదశి తిరుణాల సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సాంబయ్య, పూజారులు దత్త కుమార్ శర్మ, సుదర్శన చార్యులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్