ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులపై ఇటీవల ప్రభుత్వ అధికారులు చేసిన బైండోవర్ కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలం ప్రకాష్ నగర్ లోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం అఖిల పక్షాల కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కారం కోసం కార్మికులంతా కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.