ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి వారికి ధాన్యం అమ్మి మోసపోవద్దని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం చిర్రావూరి, గుండిమెడ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.