ఎరువులు అధిక ధరలకు విక్రయించినా, నిల్వలలో వ్యత్యాసం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఎడిఎ పి. మస్తానమ్మ హెచ్చరించారు. నరసరావుపేట పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఎరువుల నిల్వలు, రికార్డులలో నమోదు చేసిన నిల్వలు, దుకాణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన బోర్డులో ఉన్న నిల్వలకు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు.