అబుదాలపల్లిలో పల్లె పండగ కార్యక్రమంలో అనగాని శివప్రసాద్
నిజాంపట్నం మండలం అముదాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం పల్లె పండగ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శివప్రసాద్ మాట్లాడుతూ, పల్లెలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లి ఆర్డీవో రామలక్ష్మి, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.