Jan 19, 2025, 12:01 IST/
పదేళ్లలో ఆరోగ్యశ్రీని నీరుగార్చారు: మంత్రి దామోదర
Jan 19, 2025, 12:01 IST
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయన్న BRS నేత హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహాం వ్యక్తం చేశారు. 'పదేళ్లు ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి వెళ్లారు. మేం ఏడాదిలో పాత బకాయిలతో కలిపి రూ.1130 కోట్లు చెల్లించాం. ప్యాకేజీల రేట్లు రివైజ్ చేసి 22% మేర ఛార్జీలు పెంచాం. ఆసుపత్రుల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం' అని తెలిపారు.