AP: కొడుకు మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిని వానరం ఓదార్చింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనిశెట్టి పవన్ గత నెల 26న గోదావరి నదిలో మునిగి మృతి చెందారు. శనివారం దశదిన కర్మ నిర్వహించారు. దుఃఖంలో తల్లి రామలక్ష్మి రోదిస్తుండగా.. వానరం ఆమె దగ్గరికి వచ్చింది. ఆమెను కౌగిలించుకుని.. కాసేపటి తర్వాత వెళ్లిపోయింది.