కూటమి ప్రభుత్వం దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు టిడిపి జిల్లా కార్యదర్శి రమేష్ తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని పొడపాడు, పెద్దకూరపాడు, గారపాడు, క్రోసూరు, అచ్చంపేట గ్రామాలలో మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.