బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం..

80చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారి జిబిసి రోడ్డు అభివృద్ధి విస్తరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. రూ. 6 కోట్ల నిధులతో 650 మీటర్లు బిటి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆర్ అండ్ బి ఏ ఈ రాంబాబు మీడియాకు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా యుద్ధ ప్రాతిపదికపై రోడ్డు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్