ఈనెల 15 లోపు ఈ కేవైసీ చేయించుకోండి: ఏడిఏ రామకోటేశ్వరి

69చూసినవారు
పొన్నూరు సబ్ డివిజన్ పరిధిలోని రైతులందరూ ఈ నెల 15 లోపు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పొన్నూరు ఏడిఏ పి. రామకోటేశ్వరి అన్నారు. మంగళవారం కార్యాలయంలో జరిగిన మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాట్లాడారు. ఈ కేవైసీ నమోదు వలన రైతులకు బహుళ ప్రయోజనాలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఎంపీపీ భవనం పద్మలీల, సలహా మండలి చైర్మన్ పిచ్చిరెడ్డి, బొద్దులూరి రంగారావు, ఎఓ వెంకట్రామయ్య, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :