రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం గోరుముద్దను అమలు చేస్తుందన్నారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో నూరుశాతం పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పొన్నూరు పట్టణంలోని 5వ వార్డు మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంఈఓ శోభా చంద్ తనిఖీ చేశారు. ప్రభుత్వం నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు రుచి, శుచిగా ఆహారపదార్ధాలను తయారు చేసి అందజేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వివి రాఘవరావు, సిఆర్పీలు దేవరపల్లి దాసు, గోవర్ధని తదితరులు పాల్గొన్నారు.