ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు జీవో కాలం పది సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయిందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు గూడవల్లి గంగాధర్ అన్నారు. పొన్నూరు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఇంకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదని దీని సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు చట్టం ఇంకో పదేళ్లపాటు అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు.