గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని భవిత కేంద్రంలో శనివారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త శరణం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైకల్యంతో ఎన్నో అవరోధాలను కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని జయిస్తూ మనందరికీ స్ఫూర్తినిస్తున్న దివ్యాంగులకు మనం చేయూతనివ్వాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక పథకాలతో పాటు అనేక వసతులను కల్పించడం అభినందనీయమని అందుకు ఉదాహరణ "భవిత" కేంద్రాలేనని పేర్కొన్నారు. కేంద్రంలోని చిన్నారులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన చిన్నారులకు కార్యక్రమంలో బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు బి. విజయ కుమారి తో పాటు ఇనగంటి సుబ్బారావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.