నిజమైన విశ్వాసం లేకుండా కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ సెల్వరాణి అనే ఓ క్రైస్తవ యువతి వేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. బాప్టిజం తీసుకొని హిందూ మతం నుంచి క్రైస్తవానికి మారిన వారు తిరిగి హిందువులమంటూ చెప్పుకోలేరని, వారి కులం గుర్తింపు కూడా మతం మారినప్పుడే రద్దవుతుందని తెలిపింది.