రోడ్ శంఖుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే

4932చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం, అబ్బినేనిగుంటపాలెం గ్రామం నుండి వల్లూరు వరకు ప్రస్తుతం ఒక లైనుగా ఉన్న రహదారిని రెండు లైనులుగా విస్తరించి పటిష్ట పరుచుటకు 11. 23 కి. మీ, రూ. 20. 6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రోడ్ శంఖుస్థాపన కార్యక్రమంలో గురువారం పాల్గొన్న మాజీ హోం శాఖామంత్రి మరియు ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్