
ప్రత్తిపాడు: కాకుమానులో పొలం పొలుస్తుంది కార్యక్రమం
కాకుమాను మండలంలో మంగళవారం గరికపాడు, బోడి పాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి కె. కిరణ్ పాల్గొన్నారు. అన్ని రైతు సేవా కేంద్రాలలో రైతులకు ఒక విశిష్ట సంఖ్య జారీ చేసే నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. మండల వ్యవసాయ అధికారి కె. కిరణ్ తెలియజేశారు. ఇప్పటివరకు మండలంలో 9,594 మంది రైతులు నమోదు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.