పాముకాటుకు రైతు మృతి
పాముకాటుకు రైతు మృతి చెందిన ఘటన రాజుపాలెం మండలం కోటనెమలిపురిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన బుర్రి నరసింహా రావు(63) వరిపైరులో కలుపు తీస్తుండగా పాముకాటు వేసింది. నొప్పిగా ఉండటంతో గట్టు మీదకు వచ్చి చూడగా ఎడమకాలి బొటనివేలు పక్కన రక్తం చుక్కలు కనిపించటంతో వెంటనే ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా కొండమోడు సమీపంలోకి రాగానే మృతి చెందాడు.