రాజుపాలెం: మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రాజుపాలెం మండల కేంద్రంలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (గుంటూరు) ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.