కనీస వేతన రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం

57చూసినవారు
కనీస వేతన రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం
అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కొత్త వేతన రేట్ల పెంపు అక్టోబర్ 1 నుంచే అమలవనుంది. A కేటగిరీలోని భవన నిర్మాణ, మైనింగ్, హౌస్ కీపింగ్, వ్యవసాయ తదితర రంగాల కార్మికులు రోజుకు రూ.783, B కేటగిరీలోని క్లరికల్ కార్మికులు రూ.868, C కేటగిరీలోని స్కిల్డ్ వర్కర్లు రూ.1,035 చొప్పున అందుకోనున్నారు. పూర్తి వివరాలు clc.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్