పేకాట ఆడుతున్న ఆరుగురు జూదరుల అరెస్ట్
రేపల్లె పట్టణంలోని ఫిష్ మార్కెట్ సెంటర్లో పేకాట ఆడుతున్న ఆరుగురు జూదరులను మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.10,740 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసారు. జూదమాడే వారి పై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.