

రేపల్లెలో దారుణం.. నడి రోడ్డుపై భర్తను చంపిన భార్య (వీడియో)
బాపట్ల జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య మద్యానికి సంబంధించి గొడవ జరిగింది. నిజాంపట్నం గోకర్ణమఠంకు చెందిన అమరేంద్ర, మంగళవారం రాత్రి మరోసారి తన భార్య అరుణతో గొడవ పడగా, ఆగ్రహంతో ఆమె భర్తను తలపై కొట్టి, తాడును గొంతుకు బిగించి నడిరోడ్డుపై చంపేసింది. ఈ ఘటనకు సంబంధించిన గ్రామస్థుల ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.