రైతు భరోసా పథకం కింద తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం నగదు జమవుతోంది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.6 వేల చొప్పున నిధులు జమ చేస్తోంది. దశల వారీగా అందరికీ పెట్టుబడి సాయం అందుతుంది. ఎకరంలోపు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. అర్హత ఉన్నా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకుంటే సంబంధిత ఏఈఓ, ఏఓలను సంప్రదించాలని అధికారులు సూచించారు.