ఆపదలో ఉన్న పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. చెరుకుపల్లి మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన యానాది రావు కుమారుడు దుర్గ దీక్షిత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం 14 లక్షల రూపాయల ఎల్ఓసిని మంత్రి సత్య ప్రసాద్ శనివారం దుర్గా దీక్షిత్ కుటుంబ సభ్యులకు అందజేశారు.