రేపల్లె: వృద్ధుల సంరక్షణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి
వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం వృద్ధుల సంరక్షణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రేపల్లె పట్టణ అభివృద్ధి సంఘం కార్యదర్శి సివి మోహన్ రావు కోరారు. ఆదివారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుందన్నారు. కన్నబిడ్డలు కర్కశంగా ఉండి, జన్మనిచ్చిన వారిని వదలించుకోవాలని, కనీస అవసరాలు తీర్చకుండా నిరాదరణకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.