బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు నిరాశ కలిగించింది

75చూసినవారు
రాష్ట్రానికి రాజదాని నిర్మాణంకి అప్పుగా నిధులు ఇవ్వటం సిగ్గుచేటు అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్. మణిలాల్ విమర్శించారు. బుధవారం రేపల్లెలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడ్జెట్ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని, మాటలు ఘనం చేతులు శూన్యం అన్నట్లుగా ఉందన్నారు. ఏపీ కి న్యాయం జరుగుతుందని, భారీగా నిధులువస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాల అమలుకు నిధులు ఇస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు.

సంబంధిత పోస్ట్