పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం రాత్రి రేషన్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐదు బృందాలతో పలు రైస్ మిల్లులను తనిఖీ చేసి భారీ ఎత్తున పిడిఎస్ రైస్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులను సీజ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.