సత్తెనపల్లి: త్వరలోనే రైల్వే గేటు సమస్య పరిష్కారం: ఎమ్మెల్యే
సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లోని సుమారు 30 గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రైల్వే గేటు సమస్య పరిష్కారం కాబోతుంది. పట్టణంలోని అచ్చంపేట రోడ్డులో రైల్వే గేటు వద్ద ఆరబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 57 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని గురువారం ఆయన తెలిపారు.