సత్తెనపల్లి: ప్రతి ఒక్కరు సభ్యత్వం పొందాలి: ఎమ్మెల్యే
సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్ టాక్సీస్టాండ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ్యత్వం తీసుకొని టీడీపీ కార్యకర్తను అని ఘనంగా చాటండని అన్నారు. ప్రతిఒక్కరూ రూ. 100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. రూ. 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబసభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుందన్నారు.