సత్తెనపల్లి:అధిక దిగుబడులపై అవగాహన
సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో ఎటర్న్ సీడ్స్ కంపెనీ రామిశెట్టి దుర్గాప్రసాద్ పొలంలో సోమవారం రైతు ప్రదర్శన ఏర్పాటు చేసింది. గరుడ 99 మిర్చి రకాన్ని 600 మంది రైతులు తిలకించారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నేతింటి మణికంఠ నాణ్యమైన విత్తనాల ప్రాముఖ్యత వివరించారు. రైతు దుర్గాప్రసాద్ గరుడ 99 రకం బబ్బార తెగులు, నల్లిని తట్టుకొని ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని తెలిపారు.