ఐటీ విద్యార్థులకు 36 గంటల హ్యాకథాన్
వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళా శాలలో ఐటీ విద్యార్థులకు జరిగిన 36 గంటల హ్యాకథాన్ శనివారం ముగిసింది. విద్యార్థులు 43 బృందాలుగా ఏర్పడి సామాజిక అంశాలపై నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులను రూపొందించారు. ఈ సందర్భంగా చైర్మన్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు సమాజానికి ఉప యోగపడేలా ఉన్నాయని వివరించారు. ఈసందర్భంగా చైర్మన్ హ్యాకథాన్ సీఈవో మహన్, జ్యూరీలను సన్మానించారు.