Jan 02, 2025, 06:01 IST/వేములవాడ
వేములవాడ
రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన
Jan 02, 2025, 06:01 IST
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. కొందరు చికెన్ వ్యర్ధాలు, జంతు మాంసాలు పడవేస్తుండడంతోనే ఆలయ గుడి చెరువు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్, ఆలయ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు. గుడి చెరువులో వ్యర్ధాలు పడవేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.