భట్టిప్రోలు గ్రామపంచాయతీలో శుక్రవారం గుంటూరు జెడ్పీ సీఈఓ జ్యోతిబసు తనిఖీలు నిర్వహించారు. పంచాయతీలో జమా ఖర్చుల లెక్కలు, ఇంటి పన్ను, మంచినీటి కొళాయి పన్నులు, ఇతర జమా ఖర్చుల ఫైళ్లను ఆయన పరిశీలించారు. డీఎల్డీవోలు, పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.