వైసీపీ బాపట్ల జిల్లా సెక్రటరీ యాక్టివిటీగా మానుకొండ నాయుడమ్మ
వేమూరు నియోజకవర్గపు వైసీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు చొరవతో బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో జిల్లా యాక్టివిటీ సెక్రటరీ హోదా పొందారు మానుకొండ నాయుడమ్మ. ఈ సందర్భంగా వరికుటి అశోక్ బాబుని సోమవారం కలిసి, తనకు ఈ హోదాను కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పార్టీ కోసం మరింత కష్టపడి పని చేస్తానని తెలియజేశారు.