VIDEO: కోతికి సీపీఆర్ చేసి ఆసుపత్రిలో చేర్చిన యువకులు
TG: పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం వద్ద ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో కోతి తీవ్రంగా గాయపడింది. కోతిని గమనించిన యువకులు మానవత్వం ప్రదర్శించారు. రాజీవ్ రహదారిపై స్పృహ కోల్పోయి ఉన్న కోతికి యువకులు సీపీఆర్ చేసి ఆసుపత్రిలో చేర్చారు. అయితే రమేష్ అనే యువకుడు కోతి పూర్తిగా కోలుకునే వరకు సేవలు చేస్తానంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.