సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు 5 మంది భార్యలు.. ఏడాదికో పెళ్లి
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇంజనీర్ మొదటి భార్య ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. తన భర్త పని సాకుతో చాలా రోజులుగా ఇంటి నుంచి బయటే ఉంటున్నాడని తెలిపింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా ఆసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాదికో పెళ్లి చొప్పున ఇప్పటికే 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతే కాదు నిందితుడైన భర్త ఇప్పుడు విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది.