అధికారుల వేధింపులు.. అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం (వీడియో)

76చూసినవారు
AP: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల వేధింపులు తాళలేక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. గుజ్జర్లపూడి జ్యోతి పట్టణంలోని 27వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో 18 ఏళ్ల నుంచి కార్యకర్తగా పని చేస్తున్నారు. శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉమాదేవి, నోడల్ అధికారి అరుణ, మరో ఇద్దరు విలేకరులు తనను వేధింపులకు గురి చేస్తుండటంతో ఆమె ఆత్మహత్యకు యత్నించారు.