ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ చాలా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఇప్పటికీ బారులు తీరుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు త్వరలోనే కొత్త టోల్ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అదే వార్షిక పాసుల జారీ. దీని వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు శాటిలైట్ ఆధారిత బారియర్ ఫ్రీ టోల్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.