AP: రాబోయే 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలులు వీస్తాయని, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ సూచించారు. వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగలకుండా అధికంగా నీటిని తాగాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.