ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి సందర్భంగా 26 స్పెషల్ వీక్లీ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ప్రకటించింది. సమ్మర్ నేపథ్యంలో అనేక మంది హాలీడే ట్రిప్పుల కోసం ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు స్పెషల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ట్రైన్స్ వివరాల కోసం ఐఆర్‌సీటీసీ యాప్‌ను చూడాలని పేర్కొంది.