’భరణం‘ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

71చూసినవారు
’భరణం‘ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో విడాకులు, తప్పుడు కేసులతో భర్తలను హింసించడం అధికమైంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు కీలక వ్యాఖ్యలు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ హైకోర్టు ఓ మహిళ దాఖలు చేసిన 'భరణం' పిటిషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సంపాదించే సామర్థ్యం ఉన్న, అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుంచి మధ్యంతర భరణాన్ని కోరకూడదని, సీఆర్‌పీసీలోని సెక్షన్ 125 భార్య, పిల్లలు, తల్లిదండ్రుల రక్షణ కోసమని, పని చేయకుండా ప్రోత్సహించేందుకు కాదని తెలిపింది.

సంబంధిత పోస్ట్