AP: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నేడు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. దీనిపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 'కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గళమెత్తిన ప్రజానీకానికి తోడుగా, ప్రజల తరపున వైసీపీ చేపట్టిన నిరసనలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు. ప్రజల పక్షంగా, ప్రజా సమస్యల పట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్' అని ట్వీట్ చేశారు.